Saturday, December 28, 2013

చికెన్ మిర్చి బజ్జి

కావలసిన పదార్ధాలు:
చికెన్ (బోన్ లెస్) -  200 గ్రాములు
బజ్జి మిరపకాయలు (పెద్దవి) - 10
శనగ పిండి - 1/4 కిలో
అల్లం వెల్లుల్లి మిశ్రమం - 1 చెంచా
పసుపు - కొంచెం
కారం - 1 చంచా
గరం మసాలా - కొంచెం
ఉప్పు - తగినంత
వంట సోడా - కొంచెం
నూనె - తగినంత

తయారుచేయు విధానం:
1. చికెన్ ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద పెట్టుకుని ఒక పది నిముషాలు ఉడికించాలి.
2. తరువాత అందులోని నీరు ని తొలగించి దాన్ని చల్లార్చాలి.
3. చల్లారిన తరువాత దాన్ని పూర్తిగా నలపాలి.
4. ఒక కళాయి తీసుకుని అందులో నూనె వేసి, నూనె బాగా కాగాక చికెన్ వేసి బాగా మగ్గించి, అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి బాగా కలపాలి.
5. తరువాత దీన్ని ఒక 5 నిముషాలు ఉంది స్టౌ కట్టెయ్యాలి.
6. దీన్ని చల్లార్చాక, మిరపకాయలని తీసుకుని, వాటిని చీల్చి అందులోని గింజలని తీసేసి దాంట్లో చికెన్ మిశ్రమాన్ని కూరుకోవాలి.
7. ఒక బౌల్ లో శనగపిండి ని తీసుకుని అందులో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమం, వంట సోడా వేసి బజ్జి పిండి లా కలుపుకోవాలి.
8. ఒక కళాయి లో నూనె వేడి చేసి అందులో, శనగపిండి మిశ్రమం లో ముంచిన మిరపకాయలని వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

సొరకాయ గారెలు

కావలసిన పదార్ధాలు:
సొరకాయ తురుము - 1 కప్పు
బియ్యపు పిండి - 1/2 కప్పు
అల్లం వెల్లుల్లి మిశ్రమం - 1/2 చెంచా
సన్నగా తరిగిన పచ్చి మిర్చి - 5
ఉల్లి - 1
పుదీనా - కొంచెం
కరివేపాకు - కొంచెం
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె - తగినంత


తయారుచేయు విధానం:
1. సొరకాయ తురుము ని ఒక బౌల్ లో తీసుకుని అందులో బియ్యపు పిండి, మిర్చి, తరిగిన ఉల్లి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి.
2. అవసరమైతే కొంచెం నీరు కలుపుకోవాలి.
3. కళాయి పెట్టుకుని అందులో నూనె వేడి చేసుకుని, పై మిశ్రమాన్ని గారెల్లా చేసుకుని ఫ్రై చేసుకోవాలి.
4. ఇవి అల్లం లేదా కొబ్బరి చట్నీ తో చాలా బావుంటాయి.

Friday, December 27, 2013

చేప పచ్చడి

కావలసిన పదార్ధాలు
చేప - కిలో
కారం - 1/4 కిలో
పసుపు - 2 చెంచాలు
ఆవ పిండి - 5 చెంచాలు
మెంతి పిండి - 1 చెంచా
నిమ్మ ఉప్పు - 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి మిశ్రమం - 5 చెంచాలు
కొత్తిమీర - 1 కట్ట
పుదీనా 1/2 కట్ట
ఉప్పు - తగినంత
వెల్లుల్లి - 2 పాయలు
నూనె - 500 గ్రాములు (పచ్చడి నిలువ ఉండటానికి కావాలంటె ఎక్కువ వేసుకోవచ్చు)
గరం మసాలా - 2 చెంచాలు



తయారుచేయు విధానం:
1. చేప ను శుభ్రం చేసుకుని, అంగుళం ముక్కలుగా కోసుకుని, అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టి ఉంచాలి.
2. నూనె వేడి చేసుకుని కలిపిన ముక్కలని ఆ నూనె లో ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
3. ఒక గిన్నె తీసుకుని కారం, ఆవ పిండి, మెంతి పిండి, నిమ్మ ఉప్పు, వెల్లుల్లి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి అందులో వేయించిన చేప ముక్కలని వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
4. స్టౌ మీద కళాయి పెట్టుకుని నూనె వేసి బాగా కాగాక, అందులో అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి మంచి రంగు వచ్చేవరకు వేయించుకొవాలి.
5. అందులో కొత్తిమీర, పుదీనా వేసి 2 నిముషాలు వేయించి స్టౌ కట్టెసి చల్లార్చాలి.
6. ఈ చల్లార్చిన మిశ్రమాన్ని కలిపి ఉంచిన చేప ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
7. అవసరం అయితే కొంచెం నూనె వేడి చేసి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి.
8. 3 రోజులు నిలువ ఉంచాక బాగా కలుపుకుని వాడుకోవాలి.

మామిడి అల్లం పచ్చడి

కావలసిన పధార్ధాలు:

మామిడి అల్లం- 250 గ్రాములు (మామిడి సువాసన తో అల్లం, మార్కెట్ లో దొరుకుతుంది)
ఆవపిండి - 3 చెంచాలు
కారం - 4 చెంచాలు
నిమ్మ ఉప్పు - 1/2 చెంచా
ఉప్పు - 2 చెంచాలు
పసుపు - కొంచెం
ఇంగువ - కొంచెం (గట్టిది)

పోపు కోసం :
జీలకర్ర - ఒక చెంచా
ఆవాలు - కొంచెం
ఎండుమిర్చి - 5
కరివేపాకు - 3 రెమ్మలు
మినపప్పు - ఒక చెంచా
నూనె - 250 గ్రాములు

తయారుచేయు విధానం:
1. ముందుగా అల్లం శుభ్రంగా కడిగి తుడిచి నీడ లో ఆరబెట్టాలి. ఆరాక పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి.
2. తురిమిన అల్లం ని ఒక గిన్నె లోనికి తీసుకుని, అందులో ఆవపిండి, కారం, నిమ్మ ఉప్పు, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.
3. పోపు దినుసులతో పోపు వేసుకుని ఆ కలిపిన అల్లం మిశ్రమం లో వేసి బాగా కలపాలి.
4. దీన్ని ఒకరోజు నిలువ ఉంచుకుని వేడి వేడి అన్నం లో తింటే చాల రుచిగా ఉంటుంది.