Friday, December 27, 2013

చేప పచ్చడి

కావలసిన పదార్ధాలు
చేప - కిలో
కారం - 1/4 కిలో
పసుపు - 2 చెంచాలు
ఆవ పిండి - 5 చెంచాలు
మెంతి పిండి - 1 చెంచా
నిమ్మ ఉప్పు - 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి మిశ్రమం - 5 చెంచాలు
కొత్తిమీర - 1 కట్ట
పుదీనా 1/2 కట్ట
ఉప్పు - తగినంత
వెల్లుల్లి - 2 పాయలు
నూనె - 500 గ్రాములు (పచ్చడి నిలువ ఉండటానికి కావాలంటె ఎక్కువ వేసుకోవచ్చు)
గరం మసాలా - 2 చెంచాలు



తయారుచేయు విధానం:
1. చేప ను శుభ్రం చేసుకుని, అంగుళం ముక్కలుగా కోసుకుని, అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టి ఉంచాలి.
2. నూనె వేడి చేసుకుని కలిపిన ముక్కలని ఆ నూనె లో ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
3. ఒక గిన్నె తీసుకుని కారం, ఆవ పిండి, మెంతి పిండి, నిమ్మ ఉప్పు, వెల్లుల్లి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి అందులో వేయించిన చేప ముక్కలని వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
4. స్టౌ మీద కళాయి పెట్టుకుని నూనె వేసి బాగా కాగాక, అందులో అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి మంచి రంగు వచ్చేవరకు వేయించుకొవాలి.
5. అందులో కొత్తిమీర, పుదీనా వేసి 2 నిముషాలు వేయించి స్టౌ కట్టెసి చల్లార్చాలి.
6. ఈ చల్లార్చిన మిశ్రమాన్ని కలిపి ఉంచిన చేప ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
7. అవసరం అయితే కొంచెం నూనె వేడి చేసి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి.
8. 3 రోజులు నిలువ ఉంచాక బాగా కలుపుకుని వాడుకోవాలి.

No comments:

Post a Comment